జానకిపురం ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన జిల్లా పరిషత్ చైర్మన్

Published: Thursday September 09, 2021
బోనకల్లు, సెప్టెంబర్ 08, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండలం జానకిపురం ప్రభుత్వ పాఠశాలను ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పరిశీలించడం జరిగింది. ముందుగాపాఠశాలలోనీ క్లాసు రూములను పరిసర ప్రాంతాలను వంటశాలను ఉపాధ్యాయుల అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించినారు. అనంతరం జెడ్పీ చైర్మన్ కమల్ రాజు మాట్లాడుతూ విద్యార్థులను కరోనా నిబంధనలు పాటిస్తూ ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా చదువుకోవాలనే, ఇంకా పాఠశాలకు రాని వారు ఎవరైనా ఉంటే ఉపాధ్యాయులను వారితో మాట్లాడి పాఠశాలకు వచ్చే విధంగా విద్యార్థులకు తెలియ చేయాలని అన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడుతూ పిల్లలకు కావాల్సిన సదుపాయాలు అన్నీ ఉన్నాయో లేవో అడిగి తెలుసుకున్నారు. ధర్మామీటర్ శానిటైజర్ మాస్కులు అందుబాటులో ఉంచుకుని పిల్లలకుఆరోగ్య భద్రత విషయంలోఅనగా జ్వరం లాంటి ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తెలియజేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అనంతరం మధ్యాహ్న భోజన తయారీ చేసే వారి వద్దకు వెళ్లి భోజనం తయారు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని విద్యార్థులకు భోజనం తయారు చేయాలని, పరిశుభ్రతను పాటించాలని వారికి తెలియజేశారు. అనంతరం ఉపాధ్యాయుల అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించి విద్యార్థులను స్కూల్ కు వచ్చే విధంగా గ్రామంలోకి వెళ్లి మోటివేషన్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీదేవి, మండల టిఆర్ఎస్ అధ్యక్షులు బంధం శ్రీనివాసరావు, మాజీ జెడ్పిటిసిబానోత్ కొండ, గ్రామ సర్పంచ్ చిలక వెంకటేశ్వర్లు, వివిధ హోదాల్లో ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.