మధ్యాహ్నం 2 గంటలకు అనవసరంగా రోడ్లపైకి రావద్దు

Published: Tuesday June 01, 2021
జగిత్యాల, మే 31 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లా ఎస్పీ సిందూశర్మ పట్టణంలోని వివిధ ప్రాంతలను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ మధ్యాహ్నం 2 గంటల తరువాత ఎవరూ అనవసరంగా బయటికి రావద్దని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మధ్యాహ్నం ఒంటి గంటకు దుకాణ సముదాయాలు షాప్స్ మూసివేయాలని లాక్ డౌన్ పొడిగింపు ఆదేశాలకు అనుగుణంగా ప్రజలు పోలీస్ వారికి సహకరించాలని కోరారు. జిల్లాలో మరింత కఠినంగా లాక్డౌన్ ను మరో 10 రోజుల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తామని జిల్లా ఎస్పీ అన్నారు. ఎలాంటి పాసులు లేకుండ అనవసరంగా బయటకు వచ్చే వాహనాలపై కఠినంగా వ్యవహరించి సదరు వాహనాలను సీజ్ చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలు బయటకు వచ్చినప్పుడు భౌతిక దూరం పాటిస్తూ కరోనా రాకుండ జాగ్రత్తలు తీసుకోవాలని సిందూశర్మ తెలియజేశారు. ఎస్పీ వెంట ఏఆర్ డీఎస్పీ ప్రతాప్ ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆర్ఐ నవీన్ మల్యాల సిఐ కిషోర్ ఉన్నారు.