కంటి వెలుగు ఔట్ సోర్సింగ్ ఇంటర్వ్యూ

Published: Thursday December 15, 2022
* జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పాల్వాన్ కుమార్
వికారాబాద్ బ్యూరో 14 డిసెంబర్ ప్రజా పాలన : జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా డేటా ఆపరేటర్ లుగా ఔట్సోర్సింగ్ పద్ధతిలో 5 నెలల పాటు పని చేయుటకు ఈనెల 15 న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పాల్వాన్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.  నెలకు రూ.19,500/- లు చొప్పున పారితోషకం అందజేయడం జరుగుతుందని, అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్ ఆపరేటింగ్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 15 న ఉదయం 10:00 గంటలకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని తెలిపారు.