ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 27ప్రజాపాలన ప్రతినిధి బుగ్గతండా నుండి ఎల్లమ్మ తండా రోడ్డు వరకు బ

Published: Tuesday February 28, 2023
మంచాల మండలం అరుట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని బుగ్గ తండా నుండి ఎల్లమ్మ తండా రోడ్డు వరకు బి.టి.రోడ్డు వేయాలి మండలంలోని వివిధ గ్రామాలకు  పాడై పోయిన రొడ్లు అన్ని మర్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షుడు నేనవత్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో మంచాల మండలం ఎంపీ డివో కార్యాలయంలో సూపర్ డెంట్.అధికారి.ఎళ్లేంకి. జంగయ్యగౌడ్ కు వినతిపత్రం అందచేశారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్యగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పట్టి వరకు బుగ్గతండా నుండి ఎల్లమ్మ తండా వరకు వెళ్లే రోడ్డు ఎలాంటి మర్మతులు చేయక పోవటంతో రోడ్డు మొత్తం కంకర తెలి వాహన దారులకు ప్రమాదంగా మారింది అన్నారు బుగ్గ తండా రోడ్డు విషయం పై అధికారులకు  ప్రజా ప్రతినిధులకు ఎన్ని సార్లు చెప్పిన పట్టించు కునే నాధుడే లేడు అన్నారు ఎన్నికల సమయంలో మాత్రం బుగ్గతాండను అన్ని విధాలుగా అబివృద్ది చేస్తాం అని గొప్పలు చెప్పటం తప్ప చేసేది ఏమి లేదు అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతి తండాకు బిటి రోడ్లు వేస్తాం అన్ని రకాలుగా అబివృద్ది చేస్తాం అని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ తండాలను అబివృద్ది చేయటంలో పూర్తిగా విఫలం అయ్యారు అన్నారు మంచాల మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లే రోడ్లు అన్ని పాడై పోయి వాహన దారులు ప్రమాదాలకు గురి అవుతున్న  రోడ్లు మర్మతులు చేయటంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది పట్టణ ప్రాంతాల్లో మాత్రం రోడ్డు ఎక్కడ పాడై పోతే వెంటనే మర్మతులు చేసే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో  పాడైన రోడ్లు ఎందుకు మర్మతులు చేయించారు గ్రామీణ ప్రాంతాల ప్రజలను రాబోయే ఎన్నికల్లో ఓటు అడగరా ఇదేనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలన వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బిటి రోడ్డు లేని ప్రతి గ్రామానికి బిటి రోడ్డు వేయాలి పాడై పోయిన రోడ్లు అన్ని మర్మతులు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో
మంచాల మండలం ఎస్టీ సెల్ నాయకుడు
సపవట్. రామారావు నాయక్ గిరిజన సంఘం నాయకుడు జాటోత్. బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.