మున్సిపాలిటీ ప్రజల సమస్యలను పరిష్కరించండి.

Published: Tuesday May 17, 2022
..... వైరా మున్సిపాలిటీ కమీషనర్ కు వినతి
 
.... ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు మెరుగు రమణ.
 
వైరా మున్సిపాలిటీలో పేరుకు పోయిన ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు మెరుగు రమణ అన్నారు. సోమవారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) వైరా పట్టణ కమిటీ సమావేశం పట్టణ అధ్యక్షురాలు మచ్చా మణి అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం ఐద్వా ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీలో నిర్వహించిన సర్వేలో ప్రజలు వెలిబుచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వైరా మున్సిపాలిటీ కమీషనర్ అందుబాటులో లేకపోవడంతో ఏఈ అనితకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు మెరుగు రమణ, వైరా పట్టణ కార్యదర్శి గుడిమెట్ల రజిత మాట్లాడుతూ వైరా మున్సిపాలిటీలో అంతర్గత డ్రైనేజీలను నిర్మించాలని, ప్రతిరోజూ త్రాగునీరు సరపరా చేయాలని, వితంతు, ఒంటరి మహిళలకు పెన్షన్లు మంజూరు చేయాలని, అభయ హస్తం నగదును వాపస్ ఇవ్వాలని, డ్వాక్రా గ్రూపులకు గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు చావా కళావతి, బందెల అమ్రృతమ్మ, గనమనేని విజయ, తోట పద్మ, కుదురుపాక నాగమణి, దేవళ్ళ సుజాత, వేముల భూలక్మి, , రాచబండి విజయ, లలిత తదితరులు పాల్గొన్నారు.