జర్నలిస్ట్ ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం..

Published: Tuesday September 21, 2021
-టీ డబ్ల్యూ జే ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తోట్ల మల్లేష్ యాదవ్
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్ 20, ప్రజాపాలన : జర్నలిస్ట్ ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని టీడబ్ల్యూ జె ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తోట్ల మల్లేష్ యాదవ్ అన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీ డబ్ల్యూ జే ఎఫ్)రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ఫ్లకార్డులతో నిరసన తెలిపిన అనంతరం జర్నలిస్ట్ ల సమస్యల పరిష్కారం చేయాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన జర్నలిస్ట్ లందరికి ఇళ్ళు లేదా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, విలేఖరు లందిరికి చిన్న, పెద్ద పేపర్ అనే తేడా లేకుండా అక్రిడియేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్ట్ ల పై జరుగుతున్న దాడులను అరికట్టాలని అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన జర్నలిస్ట్ లకు ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందించాలని, కరోనాతో చనిపోయిన జర్నలిస్ట్ లకు రూ.25 లక్షల ఎక్సగ్రేషియా ఇవ్వాలని తెలిపారు.. జర్నలిస్ట్ లకు రక్షణ కలిపిస్తూ, మీడియా అకాడమీ కి బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కమిటీ సభ్యులు చింతకింది మధు సూధన్, మిట్టపల్లి మధు, జిల్లా ఉపాధ్యక్షులు అత్తె సాగర్, సబ్బని భాస్కర్, గొర్రె లక్ష్మణ్, రాజేష్, గోపతి సత్యం, సమ్మయ్య, గోపి, నరేష్, సుమన్, సురేష్, వంశీ, సతీష్ లు పాల్గొన్నారు.