ప్రపంచ అవయవ దాన మార్పిడి దినోత్సవం రోజున దివ్యాంగురాలు ఉదారం

Published: Saturday June 26, 2021

మేడిపల్లి, జూన్ 25 (ప్రజాపాలన ప్రతినిధి) చిన్నప్పుడే పోలియోతో రెండు కాళ్లను పోగొట్టుకొని సమాజానికి తన వంతు సేవ చేస్తున్న దివ్యాంగురాలు వేముల బాలమని ప్రపంచ అవయవ దాన మార్పిడి దినోత్సవం రోజు తన మరణానంతరం తన పార్ధివదేహాన్ని మరియు నేత్రాలను తెలంగాణ నేత్ర శరీర అవయవ దాతలు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ అశోక్ కు అంగీకార పత్రాన్ని అందజేసి తన సేవా నిరతిని చాటుకుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్, ఉప్పల్ ప్రాంతానికి చెందిన వేముల బాలమని సామాజిక సేవలో తనకంటూ ప్రత్యేక శైలితో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో అవయవ దానం గురించి తెలుసుకొని ప్రపంచ అవయవదాన, మార్పిడి దినోత్సవాన్ని పురస్కరించుకొని  సంబంధిత సంఘం రాష్ట్ర బాధ్యులను సంప్రదించి చక్కటి నిర్ణయాన్ని తీసుకోవడం అభినందనీయమని డాక్టర్ అశోక్ కొనియాడారు. ఈ సందర్భంగా బాలమనినీ పలువురు అభినందించి, ఆదర్శంగా తీసుకోవాలని ప్రత్యేక అభినందన సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్కరణ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు వాణి, అవయవ దాతలు సంఘం రాష్ట్ర  బాధ్యులు పేర్ల పురుషోత్తం, దుర్గేశ్వర, సాయి కుమార్, డాక్టర్ శివుడు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అశోక్ పరికిపండ్ల ఫోన్ నెంబర్ 9989310141, 9390111929.