అవెన్యూ ప్లాంటేషన్ పనిలో నిజాంపేట్ సర్పంచ్ జగదీశ్వరా చారి

Published: Thursday January 20, 2022
హైదరాబాద్ 19 జనవరి ప్రజాపాలన ప్రతినిధి: తెలంగాణకు హరిత హారంలో భాగంగా రోడ్డు పక్కన చెట్ల (అవెన్యూ ప్లాంటేషన్) ను నాటి వాటి రక్షణ కోసం ముల్ల పొదను ఏర్పాటు చేయడంలో తన వంతు కృషి చేస్తున్న నిజాంపేట్ సర్పంచ్ జగదీశ్వరా చారి. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ మండలం నిజాంపేట్ గ్రామ సర్పంచ్ జగదీశ్వరా చారి తన వంతు బాధ్యతగా గ్రామంలో నాటిన మొక్కలకు రక్షణగా ముల్ల పొదను ఏర్పాటు చేయడంలో కార్మికులతో పాటు తాను బాధ్యతగా ఈ పనిలో పాలుపంచుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల పక్కన, హైవేలు మరియు దారిలో చెట్లను నాటడాన్ని అవెన్యూ ప్లాంటేషన్ అంటారు. అవెన్యూ ప్లాంటేషన్ సాధారణంగా సౌందర్య విలువ, నీడ ప్రయోజనం, నేల కోతను నియంత్రించడం మరియు కలప, పువ్వులు & పండ్ల యొక్క ఆర్థిక ఉపయోగం కోసం చేపట్టారు. అవెన్యూ చెట్ల పెంపకం అవెన్యూలు: రోడ్లు, వీధులు, పార్కులు మరియు గార్డెన్‌లలో కూడా నాటడానికి అనువైన రకాల చెట్లను పెంచడంపై దృష్టి పెడుతుంది. చెట్లు వాటి లక్షణం నిటారుగా ఉండే ఆకారం ద్వారా వర్గీకరించబడతాయి. అవెన్యూ చెట్లు-మౌల్మీన్ రోజ్‌వుడ్. చైనా బాదం చెట్టు సిల్వర్ ట్రంపెట్ ట్రీ, మిలింగ్టోనియా, మర్రి చెట్టు, టబెబుయా రోజా, డెలోనిక్స్ రెజియా, ఇండియన్ మాస్ట్ ట్రీ, అశోక మొదలగునవి. తెలంగాణలో ఉన్న 24 శాతం అటవీ ప్రాంతంలో నూటికి నూరు శాతం అడవులు పెంచడం. పట్టణాలు, గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున సామాజిక అడవుల పెంపకం. తెలంగాణ వ్యాప్తంగా ఐదేళ్ల కాలంలో 230 కోట్ల మొక్కలు నాటి, వాటిని సంరక్షించడం. అటవీ ప్రాంతంలో 100 కోట్ల మొక్కలు, సామాజిక అడవుల కింద 120 కోట్ల మొక్కలు, హైదరాబాద్ నగర పరిధిలో 10 కోట్ల మొక్కలు నాటడం. సహజసిద్ధమైన అడవులను పరిరక్షించడం, పునరుజ్జీవింపచేయడం. అటవీ భూముల దురాక్రమణను అడ్డుకోవడం. పెద్ద ఎత్తున సాగే వృక్షాల నరికివేతను నిలువరించడం. సామాజిక అడవుల పెంపకానికి పెద్దఎత్తున చర్యలు చేపట్టడం. ప్రజల భాగస్వామ్యంతో విస్తృతంగా మొక్కలు నాటి సంరక్షణకు సమగ్ర చర్యలు చేపట్టడం వంటి లక్ష్యాలతో హరిత హారం కార్యక్రమాన్ని  ప్రారంభించారు. పల్లె ప్రకృతి వనాల తో గ్రామాలు పచ్చదనంతో నిండిపోయాయి.