ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

Published: Monday February 20, 2023
జగిత్యాల, ఫిబ్రవరి 19 (ప్రజపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలోని చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా పట్టణంలోని గీత విద్యాలయం సమీపంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ ముదిగంటి రవీందర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గోలీ శ్రీనివాస్ మండలోజు రాజేందర్ మరియు 29వ వార్డులో చత్రపతి శివాజి మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గట్టు సతీష్ దేశాయి దామోదర్ రావు కౌన్సిలర్లు జుంబర్తి రాజ్ కుమార్ పంభాల రామ్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.