పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి

Published: Monday June 07, 2021
మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి
మేడిపల్లి, జూన్6 ప్రజాపాలన ప్రతినిధి) : లాభాపేక్షకు తావు ఇవ్వకుండా ప్రైవేట్ ఆస్పత్రుల యజమాన్యం పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి సూచించారు. పీర్జాదిగూడ న‌గ‌ర పాల‌క సంస్థ ప‌రిధిలోని సాయిన‌గ‌ర్‌లో నూత‌నంగా ఏర్పాటు చేసిన జేపీ హ‌స్ప‌టిల్ ప్రారంభోత్స‌వానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామ‌కూర మ‌ల్లారెడ్డి, శాస‌న మండ‌లి స‌భ్యులు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎంపీలు నేత‌కాని వెంక‌టేష్‌, బీబీ పాటిల్, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి బాబు మోహ‌న్‌, జీహెచ్ఎంసీ మాజీ మేయ‌ర్ బోంతు రామ్మోహ‌న్ హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 23వ డివిజన్ కార్పొరేేేటర్ మధుసూదన్ రెడ్డి, చర్లపల్లి కార్పోరేట‌ర్ బోంతు శ్రీధేవి, మాజీ ఎంబీసీ చైర్మ‌న్ తాడూరి శ్రీనివాస్‌, టీఆర్ఎస్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయ‌కులు మంద సంజీవ రెడ్డి, ద‌ర్గా ద‌యాకర్ రెడ్డి, హ‌స్ప‌టీల్ నిర్వ‌హ‌కులు డాక్ట‌ర్ జ‌య‌పాల్ రెడ్డి, డాక్ట‌ర్ క‌లుకూరి అన్వేష్ ల‌తో పాటు స్థానిక నాయ‌కులు పాల్గొన్నారు.