భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్

Published: Tuesday July 12, 2022
కరీంనగర్ జూలై 11 ప్రజాపాలన ప్రతినిధి :
 
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
 
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  కలెక్టర్ ఆర్ వి కర్ణన్, కమిషనర్ ఆఫ్ పోలీస్ వి సత్యనారాయణ అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ మేయర్ వై సునీల్ రావు,డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి  లతో కలిసి నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై అన్ని శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి అని చెరువులు కుంటలు నిండిపోయాయని, ఎక్కడ ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగలేదని మంత్రి తెలిపారు. కారును సిబ్బంది అందరూ క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు. డ్రైనేజీ సిస్టం మెరుగుపడటంతో పాటు మున్సిపల్ అధికారుల ముందుచూపుతో నగర వ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డప్పటికి రోడ్ల మీద నీళ్ళు నిల్వ లేదని అన్నారు. వంగిపోయిన తుప్పుపట్టిన కరెంట్ పోల్ ను వెంటనే మరమ్మతులు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. జిల్లాలో చెక్ డ్యామ్ లన్ని సురక్షితంగా ఉన్నాయని వెల్లడించారు. భారీ వర్షాల తరువాత వ్యాధులు ప్రబలకుండా వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దని, అప్రమత్తంగా ఉండాలని మంత్రి  సూచించారు.
 
జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండేలా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టిందని అన్నారు. ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందని, గ్రామ మండల జిల్లా స్థాయిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు హెడ్ క్వార్టర్ లో అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన వెంటనే స్పందించడం కోసం జిల్లా కలెక్టరేట్ లో కాల్ సెంటర్ 0878 - 2265 ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కాల్ సెంటర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 2 గృహాలు పూర్తిగా, 34పాక్షికంగా దెబ్బతిన్నాయని ఒక చెరువు తూము, ఒక రోడ్డు దెబ్బతిన్నదని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. జిల్లా అధికారులు అప్రమత్తంగా తెలిపారు.
 
ఈ సమావేశంలో సుడా చైర్మన్ జీవి రామకృష్ణ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్ ఈ శివ శంకర్, ఆర్ అండ్ బి ఎస్ ఈ, ఎలక్ట్రిసిటీ ఏస్ ఈ గంగాధర్, ఎస్ ఆర్ ఎస్ పి ఎస్ఈ  శంకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జూవేరియా, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, జిల్లా అగ్నిమాపక అధికారి టి.వెంకన్న, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, జిల్లా ఇరిగేషన్ అధికారి తదితరులు పాల్గొన్నారు.