అవయవ దానం ఎంతో గొప్పది

Published: Friday June 17, 2022
మధిర జూన్ 16 ప్రజా పాలన ప్రతినిధి అన్ని దానాల కంటే అవయవదానం ఎంతో గొప్పదని అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని పేర్కొన్నారు. మధిర పట్టణంలో ఇటీవల అభివృద్ధి చెందిన నడికోట సుజాత (56) నేత్రాలను ఖమ్మం నేత్రనిధివారికి, పార్థివ శరీరాన్ని వైద్య విద్యార్థుల బోధనవసరాల నిమిత్తం సిద్ధిపేట వైద్యకళాశాల వారికి అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల సంఘం బాధ్యులు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం సుజాత సంతాప సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మల్లు నందిని మాట్లాడుతూ శరీర దాతకు జోహార్లు అర్పించారు.
సమాజశ్రేయస్సు దృష్ట్యా పెద్ద మనసుతో అవయవ దానం చేసిన సుజాత కుటుంబ సభ్యులను ఆమె అభినందించారు. తమ పూర్వీకుల కాలం నుండి నేత్రదానం సంప్రదాయంగా సాగుతున్నదని, ఇకముందు తాను పాల్గొనే ప్రతి సభలో నేత్ర, అవయవ, శరీర దానాల ఆవశ్యకత గురించి ప్రస్తావించి, ప్రోత్సహిస్తానని, ఇలాంటి కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తానని మల్లు నందిని పేర్కొన్నారు. అనంతరం సుజాత సోదరుడు శ్రీనివాస్ బోస్ కి, నేత్ర నిధి ప్రశంసా పత్రాన్ని సహకారం అందజేసిన కోనా మోహన్ రావుకి మెమోంటో అందజేశారు.
ఈ కార్యక్రమంలో కళాకారుల సమాఖ్య అధ్యక్షులు పుతుంబాక శ్రీకృష్ణప్రసాద్, ఇరుకుళ్ల లక్ష్మీ  నరసింహారావు పారుపల్లి వెంకటేశ్వరరావు బాబ్లా సూరంసెట్టి కిషోర్ మిరియాల రమణగుప్త, కోనా ధని కుమార్ మునుగోటి వెంకటేశ్వర్లు దారా బాలరాజు వార్డు కౌన్సిలర్ మాధవి బాబుల అశోక్ దినకర్ పాల్గొన్నారు.
 
 
 
Attachments area