*పి డి ఎస్ యు ఆధ్వర్యంలో ఆర్ డి ఓ కార్యాలయం ముట్టడి విజయవంతం*

Published: Saturday December 17, 2022

-విద్యారంగా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్.

-సంక్షేమ హాస్టల్లో మిస్ ఛార్జీలు పెంచాలి.

-గురుకుల హాస్టల్ల్లో మౌలిక వసతుల  కల్పించాలి.

చేవెళ్ల డిసెంబర్16, (ప్రజాపాలన):-  
                                        

 రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా  చేవెళ్ల మండల కేంద్రం లోని ఆర్డీవో కార్యాలయాన్ని  ముట్టడించి ఆర్ డి ఓ  వేణుమాధవ్ గారికి విద్యారంగా సమస్యలు, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్, అదేవిధంగా పెంచిన ఇంజనీరింగ్ 'లా' కళాశాలల ఫీజులను కూడా రద్దు చేయాలని రంగారెడ్డి జిల్లా 
అధ్యక్షులు కార్యదర్శులు
శ్రీనివాస్ రాజేష్ కోజ్జంకి  జైపాల్లు  పి డి స్ యూ  ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయాన్ని  ముట్టడించి వినతి పత్రం అందచేసారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చేవెళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని వెంటనే ప్రారంభించాలని, సంక్షేమ  హాస్టల్ లో విద్యార్థుల సంఖ్యా కనుగుణంగా   మెస్ చార్జీలను పెంచలన్నారు.
గురుకుల హాస్టల్ లోని మౌలిక వసతులను కల్పించాలని, ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించి, ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించి,  తదితర విద్యారంగ సమస్యలను   పరిష్కరించలని కోరారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కార్యదర్శి శ్రీనివాస్, రాజేష్, మరియు పి డి ఎస్ యు  చేవెళ్ల డివిజన్ అధ్యక్షుడు కొజ్జంకి జైపాల్,, ఉపాధ్యక్షుడు సురేష్, రమాకాంత్,వేణు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు