ప్రజా సమస్యల కొరకు అహర్నిశలు కృషి చేసిన నాయకుడు సిద్ధి వెంకటేశ్వర్లు

Published: Saturday August 27, 2022
బోనకల్, ఆగస్టు 26 ప్రజాపాలన ప్రతినిధి: సిపిఐ ఉమ్మడి జిల్లా కార్యదర్శి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి,వ్యవసాయ కార్మిక సంఘం ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పేదల అభ్యున్నత కోసం అహర్నిశలు కృషి చేసిన సిద్ది వెంకటేశ్వర్లు చిరస్మరణీయుడని సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు కొనియాడారు. మండలంలోని రాయనపేట తూం ప్రకాష్ భవన్ లో సిద్ధి వెంకటేశ్వర్లు సంస్కరణ సభను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కష్టకాలంలో జిల్లాలో అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించి చంద్రబాబు ప్రభుత్వంలో విద్యుత్ చార్జీల పెంపుకు ప్రజా ఉద్యమాలు నిర్మించిన ఘనత ఆయనదన్నారు. ఉమ్మడి జిల్లాలో భూపోరాటాల ఉద్యమానికి పుట్టకోట, కొత్తగూడెం, పాల్వంచ ఏరియాలో భూపోరాటాలు, దుమ్ముగూడెం ప్రాజెక్టు నుంచి ఖమ్మం మున్నేరును కలపాలని తదితర ప్రజాఉద్యమాలు నిర్మించి పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషిచేశారన్నారు. ప్రజా, కార్మిక, కర్షక ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లి సిద్ధి వెంకటేశ్వర్లు ఆశయాలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. ఈ సంస్కరణ సభలో సిపిఐ నాయకులు తూము రోషన్ కుమార్, వల్లబోయిన వీరభద్రం, బొమ్మినేని కొండలరావు, ఏలూరు పూర్ణచందు, తోటపల్లి ఆనందరావు ఆకెన పవన్ తదితరులు పాల్గొన్నారు.