భూ నిర్వాసితుల నష్టపరిహారం చెల్లింపులో సీనియర్ క్లర్క్ దే హవా. * సంవత్సరాల తరబడి నష్టపరిహార

Published: Monday September 05, 2022

మంచిర్యాల టౌన్,సెప్టెంబర్ 04,

ప్రజాపాలన :

 

చిరంజీవులను గుర్తించలేని సింగరేణి అధికారులు శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనుల భూసేకరణ లో భూములు, ఇండ్ల స్థలాలు, ఉపాధి కోల్పోయిన వారిలో కొంతమంది మరణించినప్పటికీ వారి వారసులను గుర్తించి నష్టపరిహారం చెల్లించడంలో జాప్యం చేస్తున్న సింగరేణి అధికారులు, నష్టపరిహారం చెల్లింపులో చేతివాటం చూపిస్తున్న సింగరేణి క్లర్క్ చిరంజీవులను గుర్తించడంలో జాప్యం వెనుక చాలా విషయాలు దాగి ఉన్నాయని బహిర్గతమవుతున్నాయి, రాజకీయ పలుకుబడి అధికారుల అండదండలతో బాధితుల కు నష్టపరిహారం చెల్లించడంలో సహకరిస్తున్న సీనియర్ క్లర్క్, క్లర్క్ మీదనే ఆధారపడి విధులు నిర్వహిస్తున్న సింగరేణి ఎస్టేట్ అధికారులు, మరణించిన భూ నిర్వాసితుల కుటుంబాలను గుర్తించి తన ఏజెంట్లతో వారిని సంప్రదించి కమిషన్ల పద్ధతిలో నష్టపరిహారం ఇప్పించుటకు కోర్టు సహాయంతోనైన అందిస్తామని హామీ ఇస్తూ అందిన కాడికి దోసుకుంటున్న వైనం అందరినీ కంటతడి పెట్టిస్తుందని బాధిత కుటుంబాలు అంటున్నారు. నచ్చినవారికి నష్టపరిహారం అందించుటకు ఒకసారి ఎంజాయ్మెంట్ చేసిన భూ సర్వేలను తిరిగి మరల రెండవసారి ఎంజాయ్మెంట్ సర్వేలు చేసి టైటిల్ సరిగా లేకున్నా, పట్టాదారు పాస్ బుక్కులు లేకున్నా కోర్టును సంప్రదించిన వారికి నూతన చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించడంలో అంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరణించిన వారిని గుర్తించి వారి వారసులకు నష్టపరిహారం అందించుటకు సింగరేణి, రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో అనేక సమస్యలతో బాధిత కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ సింగరేణి ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు ఇంత జరుగుతున్న తమకేమి తెలియదనే విధంగా వ్యవహరిస్తున్నారు. సంవత్సరాల తరబడి భూ నిర్వాసితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న అపరిష్కృత సమస్యగానే మిగిలి అనేక కొత్త సమస్యలను సృష్టిస్తుందని బాధితులు అంటున్నారు. భూ సేకరణ భూ నిర్వాసితులకు పూర్తి నష్టపరిహారం వారికి అందవలసిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పూర్తిగా చెల్లించిన తర్వాతనే ఊర్లను ఖాళీ చేయించాల్సిన బాధ్యతను మరిచి పూర్తి నష్టపరిహారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ చెల్లించకుండానే గ్రామాలకు గ్రామాలను ఖాళీ చేయించి భూ నిర్వాసితులను ప్రభుత్వమే ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ ఆర్ ఆఫీసర్, సింగరేణి అధికారులు వెంటనే స్పందించి మరణించిన వారి వారసులను గుర్తించి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. లేని యెడల పలు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అంటున్నారు.