56 మంది రైతులకు రూ 28 లక్షలు రుణాలు బోనకల్ పిఎసిఎస్ చైర్మన్ చావా వెంకటేశ్వరరావు

Published: Thursday October 06, 2022
బోనకల్, అక్టోబర్ 4 ప్రజాపాలన ప్రతినిధి:
మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక సహకార పరపతి సంఘం కార్యాలయంలో మంగళవారం 56 మంది నూతన సంఘ సభ్యులకు రూ. 28 లక్షల రుణాలను డిసిసిబి బ్రాంచ్ మేనేజర్ షేక్. షిరిన్ తో కలిసి లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ చావా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... సంఘాల ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి ప్రభుత్వం అందించే రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతుల అభ్యున్నతి కోసం సంఘ పరిధిలోని చిరునోముల గ్రామంలో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్ కు నాబార్డ్ నిధులను మంజూరు చేసిందని త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నట్లు ఆయన తెలిపారు. బోనకల్ సొసైటీ పరిధిలోని అన్నదాతలు ప్రభుత్వం రాయితీలపై అందించే ఎరువులను సహకార సంఘాల లోనే కొనుగోలు చేసి సంఘం బలోపేతానికి కృషి చేసి రానున్న రోజుల్లో ప్రభుత్వం అందించే రుణాలను ఎక్కువ మొత్తంలో పొందాలన్నారు. బోనకల్ సొసైటీ ద్వారా గోల్డ్ లోన్ డిపాజిట్ సౌకర్యమును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి బోనకల్ బ్రాంచ్ మేనేజర్ షేక్ షిరిన్, సూపర్వైజర్ షేక్ బాజీ సీఈఓ, మండే వెంకటేశ్వరరావు, స్టాఫ్ అసిస్టెంట్ అంబటి సంపత్, ఉప సర్పంచ్ యార్లగడ్డ రాఘవ గౌడ్ సహకార సంఘం డైరెక్టర్లు గుండపనేని సుధాకర్ రావు గంగుల పుల్లయ్య, నందమూరి సత్యనారాయణ, మోర్ల శీను, సంఘం సిబ్బంది, సభ్యులు, నిమ్మతోట ఖానా, వరుగు. ఐతంరాజు, మరీదు, అంజి, యార్లగడ్డ సుజాత, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area