పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి : హోంమంత్రి మొహమూద్ అలీ

Published: Friday July 30, 2021
మేడిపల్లి, జూలై 29 (ప్రజాపాలన ప్రతినిధి) : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలనీ తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు మొహమూద్ అలీ పేర్కొన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో జరిగిన లక్ష వృక్షార్చన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హోంమంత్రి మొహమూద్ అలీ, కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, మేయర్  జక్క వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, టీఎస్ఎస్ఎఫ్ దోబ్రియల్, రాచకొండ సీపీ మహేష్ భగవత్, సీసీఎఫ్ అక్బర్, అడిషనల్ కలెక్టర్ ‌జాన్ సామ్ సన్, పోలీస్ హోసింగ్ బోర్డ్ చైర్మన్ కోలేటి దామోదర్, పోలీస్ ఉన్నతాధికారులు స్వాతి లక్రా, స్టెఫీన్ రవీంద్ర, రక్షితా కృష్ణ మూర్తి తదితరులు విచ్చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో 2015 సంవత్సరంలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని అప్పటి నుండి మన తెలంగాణలో విస్తారంగా అడవులు పెరిగినయని, కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఆక్సిజన్ గురించి ఎంత ప్రాబ్లమైయిందో తెలియజేస్తూ అడవుల ఆవశ్యకతను గురించి వివరించారు. అడవులు సమృద్ధిగా పెంచినచో సకాలంలో వర్షాలు పుష్కలంగా కురిసి విరివిగా పంటలు పండుతాయని, ఈ రోజు కమిషనరేట్ ప్రాంగణంలో 40 వేల మొక్కలు పెట్టడం జరిగిందని మిగిలిన 60 వేల మొక్కలు కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. కమిషనరేట్ కొరకు స్థలం ఇచ్చిన మేడిపల్లి రైతులకు మిగిలిన భూమిలో హెచ్ఎండిఎ లేదా మున్సిపల్ కార్పోరేషన్ చే లే-అవుట్ చేసి వారికి  న్యాయం చేస్తామని పనులు కూడా త్వరలో కార్యరూపం దాల్చుతాయని సభాముఖంగా తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎం.శ్రీనివాస్, తహసీల్దార్ ఎస్తేరు అనిత, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి, సీఐ అంజిరెడ్డి, పాటల రచయిత అనంత్ శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ అనూఫ్ రూబెన్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, పోలీస్ అధికారులు & సిబ్బంది, నాయకులు, మహిళలు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.