జన్నారం లో అంబేద్కర్ జీవిత చరిత్ర ప్రదర్శన

Published: Monday March 06, 2023
జన్నారం, మార్చ్ 05, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని స్లెట్ హైస్కూల్ లో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగిందని ప్రిన్సిపాల్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శనివారం రాత్రి మండల కేంద్రంలోని స్లేట్ హైస్కూల్లో కళాకారులు నాట్య ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభ్యుదయ ఆర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో సంఘం శరణం గచ్చామి నవ భారత నిర్మాత, ప్రపంచ మేధావి, భారత రత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జీవితం - ఆశయం లక్ష్యాలపై కళాకారులు అద్భుతంగా కార్యక్రమం నిర్వహించారు. 
 బిసి బహు జనుల రాజ్యాధికారం రాజ్యాధికారం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు, అంబేద్కర్ కొందరి వాడు కాదు అందరి వాడని నాటక ప్రదర్శనలో కళాకారులు చాల వివరించినారు. బహుజన బిసి దళిత గిరిజన ఉద్యోగ సంఘాలు బహుజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వంచిత్ బహుజన్ ఆఘాడి విబిఏ పార్టీ జిల్లా అధ్యక్షులు తెలంగాణ ఎస్ సి, ఎస్ టి, బిసి మైనారిటీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ఆధ్యక్షులు గవ్వల శ్రీకాంత్, దళిత సేన ఉమ్మడి జిల్లా ఆధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, సిపిఎం జిల్లా నాయకులు కనీకారం అశోక్, బిసి సంఘం జిల్లా ఆధ్యక్షులు శ్రీరాముల గంగాధర్, రిటైడ్ తహసీల్దార్ రాజన్న, సిపిఐ మండల కన్వీనర్ మామిడి విజయ్, ఉపాధ్యాయులు తుంగూరి గోపాల్, మహిళ సంగం జిల్లా నాయకురాలు పోతు పద్మ, రత్నo, తులసిపతి, మల్లేష్, భుచ్చన్న, కొండగుర్ల లింగన్న, రాజన్న, పొనకల్ కృష్ణ, వర్ద్ మెంబర్ రమేష్, జాడి శంకర్ తదితరులు పాల్గొన్నారు