రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి అరెస్టు అప్రజాస్వామికం కెవిపిఎస్ రంగారెడ్డి జిల్లా కమిటీ ఖండ

Published: Monday July 18, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 17 ప్రజాపాలన ప్రతినిధి.నీటమునిగిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్లిన రిటైర్డ్ ఐఏఏస్ అధికారి సోషల్ డెమొక్రటిక్ ఫోరం రాష్ట్ర కన్వీనర్‌ ఆకునూరి మురళి ని పోలీసు లు అప్రజాస్వామికంగా అరెస్ట్ చేయడాన్ని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రంగా రెడ్డి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది ఈ మేరకు శనివారం కెవిపిఎస్ రంగారెడ్డి జిల్లా అద్యక్షులు  సామెల్ కార్యదర్శి ,ప్రకాష్ భరత్ కరత్ ఒక ప్రకటన విడుదల చేశారు వారు మాట్లాడుతూ ఆకునూరి మురళి ని అరెస్టు చేయడం తగదని,రాష్ట్రంలో ఏ మూలనైనా ప్రజాసమస్యలను పరిశీలించే హక్కు ఉంటుందన్నారు  నీట మునిగిన కాళేశ్వరం ప్రాజెక్టు ను పరిశీలించేందుకు వెళ్ళుతున్న మరళి బృందాన్ని మహదేవ్ పూర్ పొలీసులు అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గు చేటన్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులను కాలరాయడం అలవాటుగా
మారిందన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగంటడాన్ని జీర్ణించుకొలేకనె ఆకునూరి మురళి ని అరెస్టు చేశారన్నారు.
ప్రమాణాలు కొల్పొతున్న ప్రభుత్వ విద్యను పరిరక్షించేందుకు మురళి ఉద్యమిస్తున్నారన్నారని
స్వయంగా ఇంజనీయర్ అయిన మురళి కాళేశ్వరం ప్రాజెక్టు ను పరిశిలించి ప్రభుత్వ అవినీతి బండారాన్ని బయట పెడుతారనె భయం తోనె అరెస్టు చేశారన్నారు.
ఆయనను వెంటనే విడుదల చేయాలని వారు  డిమాండ్ చేశారు.
ఆయనను విడుదల చేయకపోతే ప్రభుత్వం తగి‌న మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు.ఈ అరెస్ట్ ను ప్రజలు ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండించాలన్నారు.