జిల్లాలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు

Published: Friday January 13, 2023

వికారాబాద్ బ్యూరో 12 జనవరి ప్రజా పాలన : జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో గురువారం వికారాబాద్ పట్టణంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా స్థానిక గ్రంథాలయ ఆవరణలో గల స్వామి వివేకానంద విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ శాసనసభ్యులు మెతుకు ఆనంద్, బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల్ కుమార్ గౌడ్, జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి హనుమంతరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.