ఆర్ వి ఆర్ కాలనిలో సరైన వసతులు కావాలని కార్పొరేషన్ అధికారులకు వినతి

Published: Wednesday August 11, 2021
బాలాపూర్: ఆగస్టు10, ప్రజాపాలన ప్రతినిధి : రామిడి వెంకట్ రెడ్డి కాలనీ లలో(ఆర్ వి ఆర్) ఇంతవరకు లేనివి డ్రైనేజీ, మిషన్ భగీరథ పైప్ లైన్, పార్కులు సుందరీకరణ చెయ్యాలని, కాలని వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి తో పాటు స్థానిక కార్పొరేటర్ కలిసి  కమిషనర్ కు మేయర్ కి వినతి. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్ కార్పొరేటర్ ముత్యాల లలిత కృష్ణ సమక్షం తో ఆర్ వి ఆర్ కాలని వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం.అశోక్ రెడ్డి కాలనీ వాసులతో కలిసి ముఖ్యంగా కాలనీకి కావాల్సిన అభివృద్ధి పనులను చెయ్యాలని కార్పొరేషన్ కమిషనర్ కు మేయర్ కి మంగళవారం వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ... 2019 సం.లో ఏర్పాటయిన రామిడి వెంకట్ రెడ్డి కాలని, ఇప్పటివరకు మునిసిపల్ కార్పొరేషన్లో పేరు నమోదు కాలేదని, ఇక్కడ  డ్రైనేజీ వ్యవస్థ గాని, మిషన్ భగీరథ పైప్ లైన్ గాని లేక కాలనీ వాసులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని స్థానిక కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఈ విషయంపై స్పందించి కమిషనర్, మేయర్ లకు కార్పొరేటర్ వివరించారని చెప్పారు. స్థానిక కార్పొరేటర్ ముత్యాల లలిత కృష్ణ మాట్లాడుతూ.... అల్మాస్గూడ సర్వే నెంబర్ 126 & 127 లో రామిడి వెంకట్ రెడ్డి కాలనీ 2019 సం.లో ఏర్పడడం జరిగిందని అన్నారు. ఇప్పటివరకు మున్సిపాలిటీ లో కాలనీ పేరు నమోదు కాలేదు, ఇక్కడ 437 ప్లాట్లు, అందులో 150 ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. ఈ కాలనిలో ఏలాంటి వసతులు లేక, కాలనీ వాసులందరు త్రివ ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ఆ కాలనీలో రెండు పార్కులు ఉన్నాయి. ఆ పార్కులను కబ్జా చేయుటకు కొందరు దృష్టశక్తులు ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. తొందర్లో పార్కులను ఫినిషింగ్ చేసి, డ్రైనేజీ, మిషన్ భగీరథ పైప్ లైన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్ వి ఆర్ కాలని వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ లక్ష్మయ్య, జనరల్ సెక్రెటరీ బి. శంకర్ జీ, వై సెక్రెటరీ వి. శ్రీనివాసరావు, అసోసియేషన్ సభ్యులు ఏ. శ్రీకాంత్, రాయ్ కురెయిన్ పరక్కెల్, రమావత్ భాషా నాయక్, కాలనీ వాసులతో కలిసి కార్పొరేషన్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి,కి మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి లకు కాలనీ అభివృద్ధి గురించి వినతి పత్రాన్ని సమర్పించారు.