ఆరుట్ల గ్రామ పంచాయతీ సిబ్బందికి దసరా బట్టల పంపిణీ

Published: Wednesday October 13, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 12, ప్రజాపాలన ప్రతినిధి: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం ఆరుట్ల గ్రామ పంచాయతీ సిబ్బందికి దసరా పండుగ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి బట్టల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాండాల జంగయ్య గౌడ్, ఎంపీటీసీ సభ్యులు కావలి శ్రీనివాస్, చీరాల రమేష్, పంచాయతీ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, వార్డు సభ్యులు పంబల శివకుమార్, చీమర్ల గాలమ్మ, నూకం మమత మల్లేష్, కోండిగారి విజయ, దూసరి రమేష్, కోఆప్షన్ సభ్యులు నయినంపల్లి యాదయ్య గౌడ్, లచ్చిరామ్, గ్రామస్థులు గుడ్డిమల్ల చంద్రయ్య, నాయినంపల్లి శ్రీనివాస్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.