పోలీస్ సర్కిల్ కార్యాలయంలో హరితహారం

Published: Monday July 12, 2021
మధిర, జూలై 11, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మధిర లోని సిఐ కార్యాలయంలో హరితహారం కార్యక్రమం సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ హరితహారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైరా ఏసిపి సత్యనారాయణ పాల్గొని మొక్కలు నాటారు. ఈ హరితహారం కార్యక్రమంలో టౌన్ SI సతీష్ కుమార్ మధిర రూరల్ SI రమేష్, బోనకల్ SI కొండలరావు, మరియు వైరా, తల్లాడ, కొణిజర్ల si లు పాల్గొని మొక్కలు నాటడం జరిగింది..