ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సిహెచ్ ఓ నర్సింగ్ రావు కు వినతి

Published: Tuesday April 27, 2021

బాలపూర్:(ప్రతినిధి) ప్రజాపాలన న్యూస్ : కరోన టెస్టులకు కరోనా వ్యాక్సిన్ కు, హాస్పిటల్ కి వచ్చే గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకమైన కౌంటర్లు వేర్వేరుగా ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి అధికారులకు వినతి సమర్పించారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు పెండ్యాల నరసింహ్మ ఆధ్వర్యంలో హాస్పిటల్ కి వచ్చే గర్భిణీ స్త్రీలకు అదేవిధంగా కరోనా టెస్ట్ వ్యాక్సిన్ కు వచ్చే వారికి కౌంటర్లు వేర్వేరుగా ఉండాలని సోమవారం నాడు మీర్ పేట్ కార్పొరేషన్ లోని ఉన్నటువంటి లేనిన్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనీ అధికారి నర్సింగ్ రావు కు వినతి పత్రాన్ని బిజెపి నేతలు సమర్పించారు. అనంతరం భాజపా అధ్యక్షులు మాట్లాడుతూ.... కరోనా సెకండ్ వే సమయంలో ప్రజలు భయభ్రాంతులకు గురై ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్గా వచ్చే గర్భిణీ స్త్రీలు, కరోనా టెస్టులకు వ్యాక్సిన్ చేయించుకోవడానికి వచ్చిన చాలా ఎక్కువ మంది వస్తున్నారు. కావున వేర్వేరు కౌంటర్లు ఉండడంవల్ల జనానికి ప్రజలకు సురక్షితంగా అన్ని విధాలుగా  జరుగుతాయని భావించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని సి.హెచ్.ఓ నర్సింగ్ రావు కు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఉన్న డాక్టర్లు సిబ్బంది వెంటనే స్పందించి తొందర్లో వేర్వేరు కౌంటర్లు పెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేషన్ ప్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి, కార్పొరేషన్  కార్పొరేటర్లు 27 వ డివిజన్ కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి, కరుణానిధి, కే హరినాథ్ రెడ్డి, భీమ్ రాజ్, బిజెపి కోడూరు సోమేశ్వర్, రాజు తదితరులు పాల్గొన్నారు.