పీవీ నరసింహారావు గారికి ఘన నివాళులు అర్పించిన మధిర మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ

Published: Friday December 24, 2021

పుట్టుక నుంచి చనిపోయేదాకా పీవీ నరసింహారావు కాంగ్రెస్ వాది సూరంసెట్టి కిషోర్
మధిర డిసెంబర్ 23 ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ పరిధిలో మండల కాంగ్రెస్ కార్యాలయంలో మండల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంసెట్టి కిషోర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిర్యాల వెంకటరమణ గుప్తా ఆధ్వర్యంలో పీవీ నరసింహారావు  చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూప్రముఖ రాజనీతిజ్ఞుడు, బహు భాషా కోవిదుడు, దక్షిణాది రాష్ట్రాల నుండి ఎన్నికైన తొలి భారత ప్రధాని, గొప్ప సంస్కరణ అభిలాషి, గొప్ప పండితుడు. కీ.శే. పి.వి.నరసింహారావు అన్నారు. భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు, పి.వి.నరసింహారావు, పీవీ గా ప్రసిద్ధుడైన ఆయన బహుభాషావేత్త, రచయిత. అపర చాణక్యుడిగా పేరుపొందిన వాడు. భారత ఆర్ధిక వ్యవస్థ లో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివి రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని సైతం చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం అతని చాతుర్యానికి నిదర్శనం.. అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు మధిర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు దుంప వెంకటేశ్వర్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ కోన ధనికుమార్ మండల ఐఎన్టియుసి అధ్యక్షుడు కోరంపల్లి చంటి పట్టణ ఐ ఎన్ టి యు సి అధ్యక్షుడు షేక్ బాజీ మండల గాంధీ పదం అధ్యక్షుడు ఆదూరి శ్రీను పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్ పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు బిట్ర ఉద్దండయ్యా మాజీ సర్పంచులు కర్నాటి రామారావు, బొమ్మకంటి హరిబాబు కాంగ్రెస్ నాయకులు బండారి నరసింహారావు, ఆదిమూలం శ్రీనివాసరావు, మైలవరపు చక్రీ మొదలగు వారు పాల్గొన్నారు