మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దు.

Published: Wednesday February 23, 2022
తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన టౌన్ ఎస్సై సతీష్ కుమార్.
మధిర ఫిబ్రవరి 22 ప్రజాపాలన ప్రతినిధి: మధిరలో పలు వాహనాల తనిఖీలు చేయుచుండగా మైనర్ యువకులు వాహనాలు నడుపుతుండగా పట్టుకోవడం జరిగింది. వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. దయచేసి తల్లిదండ్రులoదరికి ఒక మనవి. మీరు ఎవరు కూడా మీ యొక్క పిల్లలకు వాహనాలు ఇవ్వదు ఇచ్చిన ఎడల మీ మీద కూడా కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుంది. కావున దయచేసి ఈ తల్లిదండ్రులు మరియు వాహన యజమానులు ఎవరు కూడా వారి పిల్లలకు లైసెన్స్ లేకుండా వాహనాలు ఇవ్వరాదని మధిర టౌన్ ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు.