సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:ఎంపీడీఓ బోడేపుడి వేణు మాధవ్

Published: Wednesday September 21, 2022

 బోనకల్, సెప్టెంబర్ 21 ప్రజా పాలన ప్రతినిధి : ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీఓ బోడెపుడి వేణుమాధవ్ పేర్కొన్నారు. మండల పరిధిలోని చొప్పకట్లపాలెం, రాపల్లి, చిరునోముల గ్రామాలను ఆయన మంగళవారం సందర్శించారు. ఆయా గ్రామాల్లో పలు వీధులను పరిశీలించి వర్షాలతో సీజనల్‌ వ్యాధులు వస్తున్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తరుచూ డ్రైడే కార్యక్రమాలు నిర్వహించాలని సిబ్బందికి ఆదేశించారు. ఇంటితో పాటు పరిసరాలు, వీధులు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చునని తెలిపారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిల్వ ఉన్న నీటిలో ఆయిల్‌ బాల్స్‌ వేయడం ద్వారా దోమలను నివారించి వ్యాధులను ఆరికట్టవచ్చన్నారు. చిరునోముల గ్రామంలో నర్సరీని సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.