శ్రీ శ్రీ శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు

Published: Monday February 14, 2022
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 13 ప్రజాపాలన ప్రతినిధి : యాచారం మండల పరిధిలోని నజ్దిక్ సింగారంలో సర్పంచ్ అరుణ పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ సీతారామ లక్ష్మణ, శ్రీ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట కమిటి సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపసర్పంచ్ వరప్రసాద్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ ఆలయ పురోహితులు, అరవింద్ శర్మ, ఆనంద్ శర్మ, జ్ఞానం సరస్వతి ఫౌండేషన్ చైర్మెన్ సదా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.25 లక్షలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. గ్రామంలో శ్రీశ్రీశ్రీ సీతారామ లక్ష్మణ శ్రీ, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మరియు శిఖర జీవ ధ్వజస్తంభ ప్రతిష్టా మాహోత్సవం హంపీ పీఠాదీశ్వరులు విరూపాక్ష విద్యారణ్య భారతి మహస్వామిజీ, ఆచార్య పరిశుద్దానందగిరి స్వామిజీల కరకమలములచే నిర్వహించబడునని అన్నారు. ఈ నెల 19 నుంచి 21 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయని వారు పేర్కొన్నారు. ఈ నెల 19న ఉదయం గం. 11 లకు వేదస్వస్తి, మహాగణపతి పూజ, ఇతర కార్యక్రమాలతోపాటు గం.12:30 లకు అగ్ని ప్రతిష్ట యజ్ఞ ప్రారంభం, ఇతర కార్యక్రామల నిర్వాహణ, గం.1:30 లకు మంగళ హారతి, సాయంత్రం, గం.4 లకు దేవాతా విగ్రహాల ఊరేగుంపు, గ్రామోత్సవం, ఇతర కార్యక్రమాలు నిర్వహించబడుతాయని 20న రెండవ రోజు ఉదయం గం.9ల నుండి ప్రాతఃకాల పూజలు ఇతర కార్యక్రమాలు, 10:30 మహాన్యాసా పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఇతర కార్యక్రమాలు మధ్యాహ్నం 12:30 దాన్యదివాసం, మధ్యాహ్నం 1:30కు మంగళహారతి, సాయంత్రం 04కు 108 మృత్తికా కళాశాలతో మహాస్నపనం, సాయంత్రం 7:30కు శయ్యదివాసం ఇతర కార్యక్రమాలు, సాయంత్రం 8:30కు మంగళ హారతి మంత్రపుష్పం రాజు పూజలు భజన కార్యక్రమాలు ఇక చివరి రోజు 21న ఉదయం 6 గంటలకు ప్రాతఃకాల పూజలు హోమాలు గర్త పీఠ పూజలు ఇతర కార్యక్రామలు, ఉదయం 8:07కు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి పి.వి విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించబడును అని పేర్కొన్నారు. కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎంపీపీ జడ్పిటిసి జంగమ్మ యాదయ్య హాజరుకానున్నారని వారు అదేవిధంగా గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.