హరితహారంలో నాటిన హానికారక మొక్కలను తొలగించాలి.

Published: Saturday December 17, 2022
జన్నారం, డిసెంబర్ 16, ప్రజాపాలన: హరితహారం కార్యక్రమంలో భాగంగా మండలంలోని, పలు గ్రామంల్లోని వీధుల్లో రోడ్డుకు ఇరువైపులా నాటినటువంటి కొనోకార్పస్ హానికరమైన మొక్కలను తొలగించాలని తెలుగుదేశం పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు తాళ్లపల్లి రాజేశ్వర్  డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఎంపీడీవో అరుణా రాణి కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ కోనోకార్పస్ మొక్కలను నిషేధిస్తూ రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా  ఇప్పటివరకు వాటిని నిషేధించకపోగా, ఇక విడివిడిగా మొక్కలు నాటారని పేర్కొన్నారు. కోనోకార్పస్ మొక్కల నుండి వీచే గాలిలో కలిసిపోయి ప్రజల ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. కరోనా సోకి కోలుకున్న వారికి మరింత ప్రానంతకంగా ఈ కోనోకార్పస్ మొక్కలు ఉంటున్నాయాన్నారు. విదేశాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే కొనోకార్పస్ మొక్కలు, తెలంగాణలో విపరీతంగా విస్తరించి ఉన్నాయన్నారు. ఆ హానికరమైన కొనోకార్పస్ మొక్కల వలన ప్రజలు అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా ఆ మొక్కలను తొలగించే ఆస్థానంలో మంచి మొక్కలు నాటాలని, ప్రజలకు ఆక్సిజన్ అందించే మొక్కలను నాటాలని, వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.