రోజులు గడుస్తున్న రోడ్ల పైనే వరి ధాన్యాలు

Published: Monday May 24, 2021
పరిగి, 23 మే, ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా, దోమ మండల పరిధిలోని గోడుగొని పల్లి, దోర్నాల పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయటం జరిగింది. రైతులు తమ పంటను కోత కోసి 20 రోజులు గడుస్తున్నా ఐ కేపీ వారు ఇప్పటికి కూడా కొనడం లేదని సంచులు లేవని, లారీలు రావటం లేదని రైతులను వెనకకి పంపిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక వర్షం పడితే ఉన్నవి కూడ వర్షంలో తడిసి ముద్దయే పరిస్థితి ఉందని రైతులు అధికారులపైన మండిపడుతున్నారు.