గంజాయి పట్టివేత

Published: Thursday April 01, 2021
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 31, ప్రజాపాలన ప్రతినిధి : భద్రాచలం పట్టణ సిఐ స్వామి గారి ఆధ్వర్యంలో పట్టణ ఎస్ఐ వి వెంకటేశ్వరరావు మరియు ప్రొబేషనరీ ఎస్ఐ రాము తమ సిబ్బందితో ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక బ్రీజా వాహనం MH 12 RT 0887, ఒక స్కోడా కారు Ap 24AM0008 లో, ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా వస్తువు కనిపించగా వారి వాహనాలు తనిఖీ చేయగా ప్రభుత్వం నిషేధిత గంజాయి ఉండటాన్ని గమనించారు. ఈ తనిఖీల్లో వీరి వద్ద అ 198 కేజీల గంజాయి లభించింది దీని విలువ సుమారు గా 29 లక్షల 70000 రూపాయలు ఉండును. ముద్దాయిలను విచారించగా వారి పేర్లు 1 యువరాజ్ శంకర్ ది 2 అనిల్ కుంబ్లే 3 దత్తాత్రేయ శివాజీ మాటే వీరందరూ పూణే మహారాష్ట్ర కు చెందిన వారని చెప్పారు విరు ఈ గంజాయిని ఒరిస్సా సరిహద్దు ప్రాంతం నుండి e మహారాష్ట్ర పూనే కు తీసుకు వెళ్తున్నారు అని చెప్పినారు భద్రాచలం పట్టణ సరిహద్దులు 24 గంటలు పోలీసులు తనిఖీలు జరుగుతుంటాయని నిషేధిత వస్తువులైన గంజాయి మరియు ఇతర వస్తువులు తరలించిన వారిపై చట్టరీత్య చర్య తీసుకుంటామని తెలిపారు ఈ సమావేశంలో పట్టణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ స్వామి టి. స్వామి ఎస్. ఐ. v. వెంకటేశ్వరావు గారు ప్రొబేషనరీ ఎస్ఐ.రాము. మరియు సిబ్బంది పాల్గొన్నారు