ఉన్నత చదువుకై సహాయం అందించగలరు : కనక పూడి కీర్తి కుమార్

Published: Friday October 01, 2021

బోనకల్, సెప్టెంబర్ 30, ప్రజాపాలన ప్రతినిధి : బొనకల్ మండలం గార్లపాడు గ్రామానికి చెందిన కనకపూడి కీర్తి కుమార్  బాల్యం నుంచి కూడా చదువుల్లో చక్కగా రాణించే వాడు అతని తల్లిదండ్రులు పేదవాడు కావడంతో తన కుమారుడు ఉన్నత చదువులు కై ఆర్థిక సాయం చేయగలరని, విద్యాభ్యాాసం ఒకటవ తరగతి నుంచీ 5 వ తరగతి వరకు ప్రైవేట్ స్కూల్ లో చదివి తెలంగాణ సాంఘిక సంక్షేమ పాల్వంచ పాఠశాలలో సీటు సాధించి ఆరవ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత టి ఎస్ డబ్ల్యు రెసిడెన్సీ కరీంనగర్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో సీటు సాధించి 9వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకోని 9.7 స్కోర్ సాధించాడు. అనంతరం హైద్రాబాద్ లో గల టీఎస్ డబ్ల్యూ ఆర్ బి ఐ గౌలిదొడ్డీ సోషల్ వెల్ఫేర్ కళాశాలలో డాక్టర్ అవ్వాలనే పట్టుదలతో ఇంటర్ బై.పీ.సీ గ్రూప్ లో సీటు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణుడయ్యాడు. అనంతరం నీట్ ప్రవేశ పరీక్ష కు ప్రిపేర్ అయి స్వల్ప మార్కుల తేడాతో సీటు రాకపోవటంతో అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్.టీ పేద పిల్లల ఉన్నత చదువుల కోసం అంబేద్కర్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా ఋణాలు మంజూరు చేస్తాము అని ప్రకటించటంతో కిర్గిస్తాన్ లో గల ఇంటర్ నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కిర్గిస్తాన్  కాలేజీలో ఎం.బీ.బీ.స్ లో జాయిన్ అయ్యి వారీ దగ్గర వున్న కొంత డబ్బును ఇచ్చి ఆ తర్వత అంబేద్కర్ ఓవర్సీస్ బ్యాంక్ లోన్ కీ అప్లై చేసుకోగా ఆ లోన్ అనేది పీ.జీ చేసే వారికీ మాత్రమే వర్తిస్తుంది అని అధికారులు చెప్పడం తో ఉన్నత చదువుకై అప్లై చేసుకున్న లోన్ తిరస్కరించబడింది. అప్పటికే వారీ దగ్గర వున్న సుమారుగా 15 లక్షలు ఖర్చు చేసి ఎం. బీ.బీ.ఎస్. రెండు సంవ్సరాలు చదువు ను పూర్తి చేసుకొని ప్రస్తుతం మూడవ సంవ్సరము చాలా ఆర్థిక ఇబ్బందులతో  చదువుతున్నాడు. కీర్తి కుమార్ తల్లీ దండ్రులు ఖమ్మంలో ఉంటూ తండ్రి ఒక అపార్ట్మెంట్ కి వాచ్ మెన్ గాను తల్లి ఇళ్ళాల పనీ చేసుకుంటూ కష్ట పడి చదివిస్తున్నారు. కనుక వారీ తల్లీ దండ్రులు చాలా ఆర్థిక ఇబ్బందులలో వుండటంతో తమ కుమారుడి చధువుకై దాతల సహాయం కోరుతున్నారు. మానవతా దృక్పథంతో సరస్వతి పుత్రుడికి సహాయం అందించ గలరు అని వేడుకుంటున్నారు.