వంట గ్యాస్ ధరలు సామాన్యులను పస్తులుంచడం బాదాకరం

Published: Friday July 08, 2022
పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని టీఆర్ఎస్ ఆందోళన
 
కరీంనగర్ జూలై 7 ప్రజాపాలన ప్రతినిధి :
కేంద్ర ప్రభుత్వం పెంచిన నిత్యవసర వస్తువులు, గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ కరీంనగర్లోని తెలంగాణ చౌక్ లో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన నేతలు మహిళలు పెద్ద ఎత్తున నిరసనకున దిగారు.గ్యాస్ సిలిండర్ల ప్రదర్శనలతో‌మహిళలు,నేతలు ధర్నా నిర్వహించారు. సుడా‌ ఛైర్మన్,టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామక్రిష్ణారావు ఈ సందర్బంగా మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్ ధరలు‌ విపరీంగా సామాన్య, మద్య తరగతి ప్రజలు నడ్డి విరిచిందన్నారు.
 దేశ ప్రజల్లో భాగస్వామి కాకుండా నియంత పాలన చేస్తుందని పురాణ రోజుల్లో ప్రజలు అడవికి వెళ్లి కట్టెలు తీసుకువచ్చి వంట చేసుకునే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలతో మళ్ళీ దేశ ప్రజలను 20, 30 సంవత్సరాల వెనుకకు నట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం నిత్యాసర వస్తువులో ఒకటైన గ్యాస్ ధరలను భేషరత్ గా నియంత్రించి దేశ మహిళలకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే క్షమాపణ చెప్పాలని
లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలియ జేస్తామని ఆయన హెచ్చరించారు. నగర మేయర్ సునిల్ రావు మాట్లాడుతూ కేంద్రం పెంచిన వంట గ్యాస్ కో ప్రజలు ఉపవాసాలను చవి చూస్తున్నారు. గడిచిన ఆరు నెలల్లోనే కేంద్ర ప్రభుత్వం మూడు సార్లు గ్యాస్ ధరలు పెంచి సామాన్య,మద్య తరగతి ప్రజలను పొయ్యిలను వెలిగించు కోకుండా చేసిందన్నారు.
మాజీ ఎమ్మెల్సీ, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారదాసు లక్ష్మణ్ రావు, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప హారిశంకర్ , కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, టిఆర్ఎస్వి జిల్లా కో-ఆర్డినేటర్ పొన్నం అనీల్ గౌడ్,
ఈ కార్యక్రమంలో నగర కార్పొరేటర్లు, సుడా సభ్యులు, మహిళలు, టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.