వికారాబాద్ మండల టిఆర్ఎస్ పార్టీ నీ ఉపాధ్యక్షునిగా శివకుమార్ ఎంపిక

Published: Monday March 21, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 20 మార్చి ప్రజాపాలన : టిఆర్ఎస్ పార్టీ పటిష్టతకు ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో వికారాబాద్ మండల టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులుగా గోధంగూడ గ్రామానికి చెందిన శివకుమార్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన శివ కుమార్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వికారాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్, మండల పార్టీ అధ్యక్షులు కమాల్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా మండల పార్టీ సీనియర్ నాయకులకు మండల పార్టీ పదాధికారులకు పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులకు మండల పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధికి  నా శాయశక్తులా కృషి చేస్తానని గోధంగూడ పిఏసిఎస్ డైరెక్టర్ ఎం.శివకుమార్ తెలిపారు.