ఉమ్మడి రాష్ట్రాల విద్యాసంస్థల బంద్ కు సహకరించండి దళిత సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి

Published: Tuesday August 23, 2022

భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాద్ క అమృత్ వజ్రోత్సవ కార్యక్రమాలు భారత దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించిన భారత ప్రభుత్వం దళితులపై జరుగుతున్న దాడులను ఖండించడం లేదు. ఈ దేశంలో ఏదో మూలన రోజు దళితుల హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతో పటిష్టమైన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఉన్నప్పటికీ కూడా దానిని సక్రమంగా అమలు చేసేటువంటి యంత్రాంగం లేదు, ప్రభుత్వ పర్యవేక్షణ లేదు కాబట్టే ఈ హత్యలు అగ్రకుల ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నారని స్పష్టమవుతోంది. నిన్న రాజస్థాన్లో చిన్నారి స్కూల్లో కుండలోని మంచినీళ్లు తాగాడని ఆ స్కూల్ టీచర్ దళిత విద్యార్థిపై విచక్షణరహితంగా కుల అహంకారం తో  కొట్టడంతో ఆ పిల్లవాడు మరణించాడు. ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే విద్యాలయాల్లో నే కుల పిచ్చి  పాఠ్యాంశంగా చేర్చి చెబుతున్నారనిపక్క అర్థమవుతున్నది.ఇలాంటి ఘటనలను దళిత సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. అలాగే ఈ దేశానికి మూలవాసులైన మేము ఈ దేశానికి సంస్కృతి నేర్పిన మేము ఈ దేశ రక్షణ రంగంలో 75 శాతం పైబడి ఉన్న దళిత గిరిజనులు ఈ దేశాన్ని భుజస్కందాలపై మోస్తున్న మాపై మీ దాడులు సహించబోమని, ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు 23 వ తారీకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో ఇంద్ర కుమార్ మై గోల్ హత్యకు నిరసనగా పూర్తి స్థాయిలో విద్యా సంస్థలన్నీ బందు పిలుపునందుకొని సహకరించాలని, దళిత సంక్షేమ సంఘం పిలుపునిస్తోందని అన్నారు.