కార్యకర్తలే పార్టీకి బలం ప్రజలే నా బలగం ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Monday April 03, 2023
*సీఎం కేసీఆర్ తోనే సంక్షేమ పాలన సాధ్యం
*ప్రజలకు పార్టీకి వారధిగా కార్యకర్తలు పని చేయాలి
*ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి
 
మేడిపల్లి, ఏప్రిల్ 2 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్ డివిజన్ గణేష్ నగర్లోని ఎస్. ఆర్. బంక్వెట్ హాల్లో ఉప్పల్  డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వేముల సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన  బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో 8 ఏండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తద్వారా రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు  పిలుపునిచ్చారు. స్వరాష్ట్రం ఏర్పడిన 8 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టనీ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి ప్రతీ కాలనీలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటిలోను కనిపిస్తున్నాయని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పార్టీ అజేయ విజయాన్ని సొంతం చేసుకొని మూడోసారి సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి రావటాన్ని ఏ శక్తి ఆపలేదని స్పష్టం చేశారు. 
ప్రతిపక్షాలు చేసే అసత్య ఆరోపణలకు మనం చేసే అభివృద్ధిని చూపించి కౌంటర్ ఇవ్వాలని సూచించారు. 
పార్టీ బలోపేతానికి కార్యకర్తలే కీలకం అని, పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ప్రతీ కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో  మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర రెడ్డి, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, అరటికాయల భాస్కర్ ముదిరాజ్, లేతాకుల రఘుపతి రెడ్డి, బద్దం భాస్కర్ రెడ్డి, మేకల మధుసూదన్ రెడ్డి, చింతల నరసింహారెడ్డి,  మస్కా సుధాకర్, గోరిగే ఐలేష్, జహంగీర్, సత్యపాల్ రెడ్డి,  నోముల మైసయ్య ,రత్నాకర్ రెడ్డి ,భాస్కర్ ,నయాబ్ వెంకట్రావు , టామ్ టామ్ వీరేష్, గుండె రాజు, మల్లేష్ , కమటాల మల్లేష్, బడే అంజయ్య, అన్య వెంకటేష్, స్వీట్ హౌస్ రాజు, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్,  నరేందర్ , ప్రభాకర్  , అనిత రెడ్డి, రాణి రెడ్డి, హేమలత ,జినత్ బేగం, శ్యామల, నజరీన్, హీనా, జ్యోతి ,ఫాతిమా , రమా, ఉష ,మరియ నాయకులు, కార్యకర్తలు, మహిళలు,పార్టీ శ్రేణులు , కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.