మెడికో వైద్య విద్యార్థి మృత్తికీ కారకులను కఠినంగా శిక్షించాలి. -ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్

Published: Tuesday February 28, 2023

చేవెళ్ల ఫిబ్రవరి 27,(ప్రజాపాలన):-

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థి ఆత్మహత్యకు యత్నించి ఐదు  రోజులుగా మృత్యువుతో పోరాడిన పీజీ మెడికో ప్రీతి చివరికి ప్రాణాలు విడిచిన. ఘటన  ఎంతో బాధాకరణమని, ప్రీతి  మృత్తి తమను మనసు కలిచివేసిందని, స్వేరో స్టూడెంట్ యూనియన్  చేవెళ్ల  మండల ఉపాధక్షుడు రఘురాం  ఆవేదన వ్యక్తం చేసారు.
నిన్నటి  వరకు తల నొప్పికి స్పందించిన ప్రీతి బ్రెయిన్,ఈరోజు మొత్తానికే స్పందించటం మానేయటంతో.. పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెడ్‌ అయిందని          ధ్రువీకరించారు. ప్రీతి బతికే అవకాశం లేదని తల్లిదండ్రులకు ఉదయమే కౌన్సిలింగ్‌లో చెప్పారు. అయితే.. అన్ని పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే.. నిమ్స్ వైద్యులు ప్రీతి డెత్‌ను డిక్లేర్ చేశారు.నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెడికల్ విద్యార్థి ప్రీతి ప్రాణాలు విడిచింది. ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడిన ప్రీతి చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఫిబ్రవరి 26న రాత్రి 9 గంటల 10 నిమిషాలకు ప్రీతి తుదిశ్వాస విడిచిందని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. శాయా శక్తులా ప్రయత్నించినా ప్రీతిని కాపాడలేకపోయామంటూ నిమ్స్ వైద్యులు విడుదల చేసిన ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతిని బతికించేందుకు అన్ని విధాలుగా వైద్యులు ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదు. వరంగల్ కేఎంసీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థిని ఈ నెల 21 పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని అత్మహత్యకు యత్నించింది. అయితే.. అప్పుడే మల్టి ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కాగా.. మొదటి రోజు నుంచే ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తూ వస్తున్నారు. ఆమెను బ్రతికించేందుకు వైద్య బృందం అన్ని విధాలుగా కృషి చేస్తోంది. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై ఏ రోజుకారోజు వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ వస్తున్నారు. మొదట ఎంజీఎంలో వైద్యం అందించగా.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. అయితే.. నిన్నటి వరకు నొప్పికి స్పందించిన ప్రీతిలో ఈరోజు ఎలాంటి స్పందన కన్పించట్లేదని తెలిపారు. ప్రీతికి బెయిన్ డెడ్ అయినట్టు చెప్పారని ప్రీతి తండ్రి తెలిపారు. ఇంతటి కిరాతకమైన హంతకుడిని వెంటనే అరెస్టు చేసి ఉరిశిక్ష పడే వరకు.  స్వేరో స్టూడెంట్ యూనియన్ పోరాటాన్ని ఆపేది లేదు అని  హెచ్చరించారు.
తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ ప్రీతీ మరణం పై  ద్వారా సిట్టింగ్జర్జి తో  విచారణ చేపట్టాలని కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్. మరియు హెచ్ ఓ డి నాగార్జున రెడ్డిని సస్పెండ్ చేయాలని అలాగే ఈరోజు జరిగిన ప్రీతి అంతక్రియలో  తోటి వైద్య విద్యార్థులు ఒకరు కూడా హాజరు కాకపోవడం వెనక ఉన్న రహస్యం ఏమిటో అర్థం కావడంలేదని తక్షణమే కుటుంబానికి న్యాయం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మెడికల్  యాజమాన్యం మరియు నిందితుడిపై చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో గోవింద్ సింగ్, ఎండి. అబూతలా, గణేష్, రమ్య చందన మమత శ్రావణి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.