రెండో రోజు ముమ్మరంగా జ్వరం సర్వే కార్యక్రమం

Published: Saturday May 08, 2021
మధిర, మే7, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం లో పలు గ్రామాలలో రాయపట్నం, నిదనపురం గ్రామాలలో mpdo విజయభాస్కర్ రెడ్డి, సర్పంచ్ బాద కృష్ణారెడ్డి అటు రాయపట్నం సర్పంచ్ నండ్రు సుశీల ఆధ్వర్యంలో పంచాయితీ సెక్రటరీ లతో పాటు సర్వే చేపట్టారు ఈ కార్యక్రమంలో లో భాగం గా జ్వరం, ఒళ్లునొప్పులు, లాంటి లక్షణాలు ఉన్న వారిని గుర్తిస్తూఆక్సిజన్ లెవల్స్ టెస్ట్ చేస్తూ వారిని ఇంట్లోనే ఉండమని తగు జాగ్రత్తలు తీసుకోమని తెలిపారు. అలాగే కరోన 2 వేవ్ కరోన విజృంభనను తెలుపుతూ అందరూ అవసరమైతే తప్ప బయటకు రావద్దని మాస్క్ లు శానిటేజర్ ను వాడాలని తెలిపారు. మునిసిపాలిటీ పరిధి లోని అన్ని వార్డ్ లలో 2 వరోజు జ్వరం సర్వే మధిర మునిసిపాలిటీ లో ని 22 వార్డ్ లలో చైర్పర్సన్ శ్రీమతి మొండితోక లత, కమిషనర్ ఆ రమాదేవి ఆదేశాల మేరకు అన్ని వార్డ్ లలో జ్వరం సర్వే కార్యక్రమం నిర్వహించారు పలు వార్డ్ లలో వార్డ్ కౌన్సిలర్ లు స్వయం గా సర్వే లో పాల్గొని ప్రజా ఆరోగ్య విషయాలను సంబందిత ఆశా వర్కర్లు, మెప్మా Rp లు మునిసిపల్ సిబ్బంది తో నమోదు చేయించారు.ముఖ్యంగా జ్వరం, ఒంటినొప్పులు, వంటి లక్షణాలు ఉన్న వారి ఆక్సిజన్ లెవల్స్ ను పరీక్షించి వారిని ధైర్యం గా ఉండమని, తగు జాగ్రత్తలు పాటించమని సూచించారు. ఈ కార్యక్రమంలో లో అన్ని వార్డ్ లకు సంబంధించిన వార్డ్ కౌన్సిలర్లు, మునిసిపల్ అధికారులు, వార్డు ఇంచార్జిలు, అంగన్వాడీ టీచర్లు, మెప్మా Rp లు, ఆశ వర్కర్లు మునిసిపల్ అధికారులు పాల్గొని కరోన కట్టడి కి కావలసిన తగు జాగ్రత్తలు ప్రజలకు తెలిపారు.