కళ్యాణలక్ష్మీ, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చెసిన - ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Published: Monday January 17, 2022

బీరుపూర్, జనవరి 16 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ నరసింహులపల్లి కొల్వయి కండ్లపల్లి క్లస్టర్ పరిదిలోని గ్రామాలకు చెందిన 37 మంది ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి షాదిముభారక్ ద్వార మంజూరైన 37 లక్షల 4 వేల 292 రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్ లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మండలానికి చెందిన 9 మంది లబ్దిదారులకు సీఎం సహయనిధి ద్వార మంజూరైన 5 లక్షల 64 వేల విలువగల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేష్ కేడిసిసి జిల్లా మెంబర్ ముప్పాల రాంచందర్ రావు జిల్లా రైతు బందుసమితి మెంబర్ కోలుముల రమణ వైస్ ఎంపీపీ బలుమూరి లక్ష్మణ్ రావు ప్యాక్స్ ఛైర్మన్ పోల్సాని నవీన్ రావు మండల పార్టీ అధ్యక్షుడు నారపాక రమేష్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నల్ల మహిపాల్ రెడ్డి మెరుగు రాజేశం ముక్క శంకర్ వెంకటేష్ యాదవ్ గాజర్ల రాంచంద్రం గౌడ్ వివిధ గ్రామాల సర్పంచులు రిక్కల ప్రభాకర్ ఘర్షకుర్తి శిల్పరమేష్ పర్వతం రమేష్ అజ్మీర ప్రభాకర్ బోడ స్వప్న ఏలగందుల లక్ష్మీఅశోక్ ఏసు బందెల మరియా చుంచు శారద సిపతి రమేశ్ చిక్రం సుగుణ ఎంపీటీసీలు ఎడ్ల సృజన రంగు లక్ష్మణ్ నారపాక రమ నాయకులు చుంచు నరేందర్ బోడ సాగర్ బందెల రాజేశం ఏలగందుల అనీల్ చిక్రం మారుతి తదితరులు పాల్గొన్నారు.