ఇంటింటికి జ్వరం సర్వే

Published: Friday May 07, 2021
మధిర: ప్రజా పాలన ప్రతినిధి ఆరో తేదీమధిర మున్సిపాలిటీ పరిధికలెక్టర్ ఆదేశాలమేరకు మధిర పట్టణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా పట్టణంలోని అన్నీ వార్డుల్లో ఇంటింటికి జ్వరం సర్వే నిర్వహించబడుతుంది.ఈ సర్వేలో మునిసిపల్ డిపార్ట్మెంట్ వారుమరియు హెల్త్ డిపార్ట్మెంట్ వారు మీయొక్క ఇళ్లకు వచ్చినపుడు వారికి సహకరించగలరు, మీలో ఎవరికైనా జ్వరం వచ్చి తగ్గకుండా ఉండడం. జలుబు, దగ్గు, ఆయాసం, వాసన గుర్తుపట్టకపోవడం మరియు ఒంటి నొప్పులు మొదలైన లక్షణాలు కలిగిన వారు ఉన్నట్లయితే మా యొక్క జ్వరం సర్వే టీం సభ్యులకు తెలియజేసిన ఎడల వారికి కోవిడ్ మందుల కిట్ ను ఉచితంగా ఇచ్చెదరు. కావున పట్టణ ప్రజలందరు ఇట్టి విషయమును గమనించి సర్వే పూర్తి అయ్యేంతవరకు మా యొక్క కోవిడ్ టీమ్ కు సహకరించగలరని మధిర మున్సిపల్  చైర్ పర్సన్ లత జయకర్, కమిషనర్  అంబటి రమాదేవి కోరారు