ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారిశుధ్య నిర్వహణ...

Published: Friday July 09, 2021
మున్సిపల్ చైర్ పర్సన్ రణవేని సుజాత సత్యనారాయణ
మెట్ పల్లి, జూలై 08 (ప్రజాపాలన ప్రతినిధి) : ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పట్టణంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ కొనసాగుతోందని మెట్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ రణవేని సుజాత సత్యనారాయణ అన్నారు. గురువారం పట్టణంలోని 20వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జరిగిన పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి నీటిని పోశారు. కాలనీలోని మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. ప్రజలకు వారి అవసరాల నిమిత్తం అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, కౌన్సిలర్లు ఉజగిరి లక్ష్మీ శ్రీనివాస్, అంగడి పురుషోత్తం, భీమనాతి భవాని సత్యనారాయణ, కోఆప్షన్ సభ్యులు పన్నాల మాధవరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ అక్షయ్, శానిటేషన్ ఇంచార్జ్ ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలోని 25 వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మఱ్ఱి సహదేవ్, నాయకులు పిప్పెర రాజేష్ తదితరులు పాల్గొన్నారు.