అమీన్పూర్ లో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

Published: Wednesday August 11, 2021
అమీన్పూర్, ఆగష్టు 10, ప్రజాపాలన ప్రతినిధి : అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని భవానిపురంలో 50 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్లను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. అనంతరం 10వ వార్డు పరిధిలోని శ్యామ్ రాక్ అపార్ట్మెంట్లో రక్షిత మంచినీటి నల్లాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కౌన్సిలర్లు బాలమని బాలరాజ్, నవనీత జగదీష్, కొల్లూరు మల్లేష్, కృష్ణ, యూసఫ్, మల్లేష్, యూనుస్, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.