దాతల సహకారంతో సేవా కార్యక్రమాలు

Published: Friday December 16, 2022
విజయ్ సేవాసంస్థ చైర్మన్ శ్రీనివాసరావు..
 
 తల్లాడ, డిసెంబర్ 15 (ప్రజాపాలన న్యూస్)..
దాతలు అందించిన ఆర్థిక సాయంతో నిరుపేదలకు తన వంతు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు విజయ్ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ దొబ్బల శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం తల్లాడ మండలంలోని పలు గ్రామాల్లో విజయ్ స్వచ్ఛంద సేవా సొసైటీ ఆధ్వర్యంలో  చేయూతనందించారు.  మండలంలోని అంజనాపురం, తెలగవరం గ్రామాల్లో పలువురు వికలాంగులకు ఆర్థిక సాయం అందించారు. అదేవిధంగా అన్నారుగూడెం గ్రామంలో వికలాంగులకు, వృద్ధులకు, నిరుపేదలకు చీరలు పంపిణీ చేశారు. వీటిని సొసైటీ చైర్మన్ దొబ్బల శ్రీనివాసరావు చేతులమీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు నాగసుధ, అనుమోలు రాంబాబు, బాబుసాహెబ్, గ్రామ కార్యర్శులు శ్రీనివాస్, నరేంద్ర, రమ్య, కళ్యాణి, రవి, అంగన్ వాడీలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.