ప్రజా సమస్యల పరిష్కారానికై పోరాటాలే మార్గం

Published: Thursday December 15, 2022
సీపీఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు
 
బోనకల్, డిసెంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి: ప్రజా సమస్యల పరిష్కారానికై పోరాటాలే మార్గమని సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్లు లేని పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఇళ్ల స్థలాలు, స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ 10 లక్షలు కేటాయించాలన్నారు. అర్హులైన పేదలందరికీ రేషన్కార్డులు, పెన్షన్ ప్రతి నెల మొదటి వారంంలోనే ఇవ్వాలన్నారు. ధరణి పోర్టల్లో లొసుగులు తొలగించి, భూములు సమస్యలు పరిష్కరించాలని, రైతుల రుణమాఫీ అమలు చేయాలని కోరారు. మండల కేంద్రంలోని పిహెచ్సిని 30 పడకల ఆసుపత్రిగా ఆధుకరించి, అన్ని జబ్బులకు వైద్యం అందించే విధంగా డాక్టర్లను, సిబ్బందిని నియమించాలని దళితులకు దళితబంధు, బిసిలకు బిసి బంధు, గిరిజనులకు గిరిజన బంధుపథకాలు అమలు చేయాలన్నారు. ఆర్వోబి కింద జీవనోపాధి పొందే చిరువ్యాపారులను పత్నామ్యాయం చూపకుండా అమానుషంగా ఖాళీ చేయించి, వారి స్వంత స్థలాలను చూపి, వారి జీవనోపాధి మెరుగుకోసం రుణసదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో ఆర్ అండ్ బి రోడ్లకు త్వరగతిన మరమ్మత్తులు చేయాలని కోరారు. ఈ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తాసిల్దార్ సంగు శ్వేతాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు జక్కా నాగభూషణం, బొమ్మినేని కొండలరావు, మండల సహాయ కార్యదర్శి ఆకెన పవన్, శాఖకార్యదర్శులు గుడిద కృష్ణ, యంగల పెద్ద రమేష్, బుర్రి నాగేశ్వరావు, బెజవాడ నరేష్, యంగల కృష్ణవేణి, బెజవాడ శిరీష తదితరులు పాల్గొన్నారు.