డిజిటల్ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా నగదు రహిత లావాదేవీలు

Published: Tuesday September 06, 2022

 బోనకల్, ఆగష్టు 5 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో సోమవారం మండల పరిధిలోగల సీతానగరంలో నాభాడ్డ్ వారి ఆర్ధిక సహాయం తో ఖాతాదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ క్రింద అంశాల గురించి బ్యాంకు మేనేజర్ బి సీతారాములు వివరించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించడం వలన అనేక ప్రయోజనాలు పొందవచ్చనని, బ్యాంకు వారు అందించు రూపే ఎ టి ఎం కార్డు ద్వారా జరుగు లావాదేవీలు వలన పొందే ప్రయోజనాలు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భీమా, పెన్షన్ పాలసీల గురించి, ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉన్నచో ఒక ఖాతా కి ఫోన్ నెంబర్ లింక్ చేసి మిగతా పొదుపు ఖాతాలను ముగించుట పొందు ప్రయోజనాల గురించి గ్రామాల్లో బ్యాంకు మిత్ర చేయు సేవలు వాటిని ఉపయోగించుకుంటే సమయము, రవాణా ఖర్చులు మిగిలినవని చిన్న మొత్తంలో పొదుపు చేయటం వలన భావి జీవితంలో ఉపయోగపడిందని,బ్యాంకులో అందుబాటులో ఉన్న రుణ సదుపాయాలు వ్యవసాయ అనుబంధ, విద్యా, వ్యాపార తానఖా, గృహ నిర్మాణం, బంగారు వస్తువులను తాకట్టు, స్వయం సహాయక సంఘాలు (ఎస్ హెచ్ జి) ప్రభుత్వ రాయితీ రుణాలు బ్యాంకు నుండి తీసుకుని, సక్రమంగా ఉపయోగించుకొని సకాలంలో చెల్లించుట వలన పొందు ప్రయోజనాల గురించి, బ్యాంకులో అందుబాటులో గల సేవలు ఎన్ ఐ ఎఫ్ టి/ ఆర్ టి జి ఎస్ వాటిని ఉపయోగించటం వలన పొందు ప్రయోజనాలు, ఎస్బిఐ లైఫ్, యాక్సిడెంటల్, హెల్త్, క్రాప్ ఇన్సూరెన్స్ గురించి వాటిలో చేరటం వలన ప్రయోజనాలు, ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి, ఇంకుడు గుంట, పొలంలో చిన్నపాటి చెక్ డ్యాములు నిర్మించికోవటం వలన ప్రభుత్వం ద్వారా పొందు రాయితీలు, మొక్కలు నాటుట వలన పొందు ప్రయోజనాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ బి.సీతారాములు, ఖమ్మం ఎఫ్ ఎల్ సి డి.మోహన్ రావు, గ్రామ దీపిక జ్యోశ్న , ఖాతాదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.