భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం

Published: Monday September 26, 2022
ఐటిసి పి ఎస్ పి డి రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్ర, వారి ఆధ్వర్యంలో  ఉచిత మెగా హెల్త్ క్యాంప్...
 సారపాక తాళ్ల గొమ్మూరులో ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించినారు.  ఐటీసీ యూనిట్ మొహంతి గారు మరియు హెచ్ఆర్ మేనేజర్ శ్యామ్ కిరణ్ గారు. ఐటీసీ పిఎస్పీడీ రోటరీ క్లబ్ భాస్కర్ గారు మరియు అధ్యక్షులు డాక్టర్ విజయకుమార్ గారు ఐటిసి హెచ్ఆర్ మేనేజర్ చెంగల్ రావు గారు కాంట్రాక్టర్ పాకాల దుర్గాప్రసాద్. ఉన్నతాధికారులు , ఈ మెగా హెల్త్ క్యాంపు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ బూర్గంపాడు మండలం లోనే కాకుండా చుట్టుపక్క గ్రామాలన్నింటికీ కూడా ఐటీసీ ఆదుకుంటుందని ఎప్పటికప్పుడు హెల్త్ క్యాంపులు పెడుతుందని పేదవారిని అన్ని సహాయ సహకారాలు ఐటిసి వారు అందిస్తున్నారని వారు చెప్పారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు ఐ టి సి పి ఎస్ పి డి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.