మత్తుపదార్థాల నిర్మూలనే లక్ష్యంగా కృషి చేయాలి : జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఐపీఎస్

Published: Tuesday February 08, 2022
వికారాబాద్ బ్యూరో 07 ఫిబ్రవరి ప్రజాపాలన : గంజాయి, డ్రగ్స్, మత్తుపదార్థాల నిర్మూలన కొరకై ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని తమ కర్తవ్యాన్ని నిర్వహించాలని జిల్లా ఎస్‌పి ఎన్. కోటి రెడ్డి ఐపిఎస్ సూచించారు. సోమవారం వికారాబాద్ టౌన్ పురపాలక కార్యలయంలో ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులతో జిల్లా ఎస్‌పి ఎన్.కోటి రెడ్డి ఐపీఎస్ “గంజాయి, డ్రగ్స్ మరియు మత్తుపదార్థాల నిర్మూలన” పైన అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా ఎస్‌పి మాట్లాడుతూ గంజాయి వంటి మాదకద్రవ్యాలను అంతమొందించేందుకు సామాజిక బాధ్యతగా తీసుకొని మొగ్గలోనే తుంచాలని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, వ్యాపారులు, అన్ని వర్గాల ప్రజలు, యువకులు, విద్యార్ధులు గంజాయి, మత్తుపదార్థాల వినియోగం వలన కలిగే నష్టాలు మొదలగు విషయాలపై అవగాహన కలిగి ఉండాలని వివరించారు. అన్నీ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, విధ్యార్థులు  ప్రతి ఒక్కరి సహకారంతో సామాజిక ఉద్యముగా మాదకద్రవ్యాలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. గంజాయి సాగు కాకుండా ఆయా ప్రాంతాలలో ఉండే ప్రజాప్రతినిధులు ప్రజలలో అవగాహన కల్పించాలని, ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యలపై ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆప్రమత్తమై పోలీస్ వారికీ ముందస్తు సమాచారం అందించాలని సూచించారు. ఎవరైనా సాగు చేస్తే ప్రభుత్వం అందించే సబ్సిడీలు రద్దు అవుతాయి అనే విషయాన్ని ప్రజలలో అవగాహన కల్పించాలని అన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలను కట్టడి చేయకుంటే భవిష్యత్తులో సమాజంపై తీవ్రమైన దుష్ప్రభావం పడే ప్రమాదం ఉందని అన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే యువత గంజాయి, మత్తుపదార్థాల బారిన పడకుండా వారి భవిష్యత్తు దృష్యా మత్తు పదార్థాల సరఫరా, ఉత్పత్తి చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపి వాటిని యువతకు దూరం చేసి “గంజాయి, మత్తుపదార్థాల రహిత జిల్లా మార్చడమే మన లక్ష్యం” గా పెట్టుకోవాలని, ఇదివరకే జిల్లాలో గంజాయి, గుడుంబా మరియు డ్రగ్స్ పైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది అని యువతను ప్రజలను యువతను మత్తుపదార్థాలనుండి రక్షించవలసిన బాధ్యత మన పైనే ఉందని  గంజాయి సేవించిన వ్యక్తి మత్తులో ఎన్నో చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు చేసే అవకాశం ఉన్నందున ముందుగానే దాన్ని నిర్మూలించాలన్నారు. తరువాత జిల్లా ఎస్‌పి గారు అధికారులందరితో కలసి పూర్తిగా గంజాయి/డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడంలో తమ వంతు కర్తవ్యాన్ని పటిస్తాం అని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో Asst.ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లా రెడ్డి, వికారాబాద్ డి‌ఎస్‌పి సత్యనారాయణ, మున్సిపాల్ కమిషనర్ శరత్ చంద్ర, వికారాబాద్ చైర్ పర్సన్ మంజుల రమేశ్, వైస్ చైర్ పర్సన్ శంషాద్ బేగం, వికారాబాద్ ఇన్స్పెక్టర్ రాజ శేఖర్, వికారాబాద్ ఎక్సైజ్ సి‌ఐ, అందరూ కౌన్సిలర్ లు, కో ఆప్షన్ మెంబర్లు, మున్సిపాల్ సిబ్బంది, ఎక్సైజ్, అగ్రికల్చర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.