కరోనా కట్టడికి అందరం కలిసికట్టుగా పని చేద్దాం

Published: Wednesday May 12, 2021
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 
వికారాబాద్, మే 11, ప్రజాపాలన ప్రతినిధిప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ హితవు పలికారు. మంగళవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మోమిన్ పేట్ మండల ప్రజాప్రతినిధులతో కరోనా విపత్కర పరిస్థితులు తదుపరి కార్యాచరణ పై జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి ప్రతి ఒక్కరి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం పలు సలహాలు, సూచనలు అందించారు. అవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకి రావద్దని మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని తెలిపారు. శుభ అశుభకార్యాలకు వీలైనంత తక్కువ మందితో పాల్గొని భౌతిక దూరం పాటింంచాలని సూచించారు. లచ్య నాయక్ తండా ప్రజలు ప్రతి చిన్న అవసరానికి బయట తిరుగుతున్నారని, తద్వారా కేసులు పెరుగుతున్నాయని సర్పంచ్ తెలిపారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే లచ్యా నాయక్ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న చోట భౌతిక దూరం పాటించాలని కోరారు. కరోనా సోకిన వ్యక్తులను ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అవసరమైన కిట్స్ అందరికి అందేలా చూడాలని తెలిపారు. వీలైనంత ఎక్కువగా కరోనా టెస్ట్ లు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు, ఉద్యోగులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా పనిచేసి కరోనా కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ జూమ్ సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు నర్సింహ రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్లు, సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.