వైయస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 165 రోజులులకు చేరుకున్న 2300 కిలోమీ

Published: Wednesday September 28, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 27 ప్రజాపాలన ప్రతినిధివైయస్సార్ టిపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఇట్టికల సుగుణరెడ్డి*

ప్రజా సమస్యలు పరిష్కరించడంలో రాష్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమైదని వైఎస్సార్ టిపి  ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జి ఇటుకల సుగుణ రెడ్డి అన్నారు విలేకరుల సమావేశంలో అమే మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియేజకవర్గ   వైయస్సార్ టిపి పార్టీ పాదయాత్ర 164 రోజులు గా సాగుతుందని 2300 కిలోమీటర్లు పాదయాత్ర పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధన కోసం  రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తి నందు పని పాదయాత్ర చేస్తున్న షర్మిల బడుగుల కోసం తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ నిమ్మకు నీరెక్కినట్టు  వ్వవరిస్తుందని  దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తానని మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పదవి రాగానే  మాట మార్చాలంటూ అదేవిధంగా దళితుడిని సీఎం చేస్తానన్న  కుర్చీ లాక్కొని తానే కైవసం చేసుకున్నాడని ఆమె తెలిపారు. ఖానాపూర్ గ్రామంలో దళితుల భూములలో క్యాంప్ కార్యాలయం నిర్మించి దళితుల భూమిలోను కా జేస్తునరని అక్కడున    పేదవాడికి ఇండ్లు నిర్మించుకోవడం స్థలలను ఇస్తారని మాట మార్చిన ఎమ్మెల్యే అని.వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జ్  సుగుణ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తేవాలన్నదే మా లక్ష్యం చేరుకోవడమే అని ఆమె తెలిపారు. కార్యక్రమంలో బీసీ సెల్ బుర్ర జంగయ్య, యాచారం మండల అధ్యక్షుడు జశ్వంత్ రెడ్డి, రమేష్, జయరాజ్, జోసఫ్, తదితరులు పాల్గొన్నారు.