తెలంగాణ ప్రజలందరికీ బంగారు తెలంగాణ ఏర్పడలేదని....ఆవేదన

Published: Friday March 12, 2021
బాలాపూర్ : (ప్రతినిధి) ప్రజాపాలన న్యూస్; తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి బిజెపి  జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఉద్యమకారులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, తెలంగాణ ప్రజలందరూ బంగారు తెలంగాణ ఏర్పడలేదని  ప్రజలందరూ ఆకాంక్షల ఆవేదనకు చెందారనీ అన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సి. కె. ఆర్, కె. టి. ఆర్ ఫంక్షన్ లో నియోజకవర్గం ఎమ్మెల్సీ (మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి), ఎన్నికలకు  కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ హాజరై, అనంతరం ఆయన మాట్లాడుతూ..... 1969 సం...   నుండి తెలంగాణ ఉద్యమకారులు  వారి కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి లో ఉన్నాయని ఎప్పుడైనా ఆరా తీశారునీ కెసిఆర్ ను ప్రశ్నించారు. నిరుద్యోగులకు తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తుందని అంచనా వేసుకున్న వారి కల్లలు నీరుగార్చారు. ఏడు సంవత్సరాలయింది దొరల కుటుంబ పరిపాలన తెలంగాణ లో సాగుతుందిని ఆగ్రహంతో అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సి ఎక్కడ రాలేదు....? ఎవరికి రాలేదు....? ఉద్యోగాలు వచ్చినవి కల్వకుంట్ల కుటుంబంలో  కెసిఆర్ కు తనయుడుకు కూతురు కు అల్లునికి వారి బంధువులకు ఈ తెలంగాణ అప్పగించడం నీకు తగునా అని యావత్ తెలంగాణ ప్రజలందరూ హెచ్చరిస్తున్నారు అని ముక్తకంఠంతో అన్నారు. . ప్రపంచంలోనీ భారతదేశానికి గొప్ప  స్థానం రావడం అంటే  మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘనత అని కొనియాడారు. కరోనా మహమ్మారి వ్యాధి కి వ్యాక్సిన్ మనదేశంలో తయారు కావడం వల్ల  గొప్ప సైంటిస్టులు ఉన్నారని చెప్పుకోవచ్చనీ బిజెపి పార్టీకి గర్వకారణ చెప్పారు. ఇంకా మీ ఆటలు సాగవు... సెవెన్ స్టార్ ఫామ్ హౌస్ బద్దలు అవుతుందని హెచ్చరించారు. స్కూల్, కాలేజీ, విద్యార్థులు జీవితాలను నాశనం పట్టించారని ప్రతి జిల్లా ప్రజలు అంటున్నారని గర్జించారు. పట్టభద్రులరా మీ సమస్యలను, నిరుద్యోగులు ఉపాధ్యాయుల పిఆర్సి, అదేవిధంగా కార్మికులకు ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు ఎల్లవేళలా  పుష్కలంగా ఉంటాయని హామీ ఇచ్చారు. 10 కోట్ల ప్రజలకు వంట గ్యాస్, 11 కోట్ల మందికి పేదలకు మరుగుదొడ్లు, 40 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు, ప్రజల క్షేమం ఆలోచించే పార్టీ  బిజెపి. రామచంద్ర రావుకు ఓటేసి మొదటి ప్రాధాన్యత అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కానీ కార్యకర్తలకు చిన్న సందేశం తరుణ్ చుగ్ మాటల్లో  విధానాల్లో భారత్ మాతా కి జై జై లు అని ఒకరికొకరు చెవులుకొరుక్కున్నారు. తెలుగు లో అనువాదం చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బోర్డు సభ్యులు పేరాల శేఖర్ రావు, రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర ఎస్సీ మోర్చ అధ్యక్షులు గొప్ప భాష , ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి సుగుణాకర్ రావు, రాష్ట్ర నాయకుడు కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మాజీ సింగిల్విండో కోలన్ శంకర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్, కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకు పల్లి వెంకటరెడ్డి, పెండ్యాల నరసింహ్మ, రాజశేఖర్, జంగయ్య యాదవ్, బడంగ్ పేట్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, మీర్ పేట కార్పొరేషన్ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కంటెస్టెంట్ కార్పొరేటర్లు, వివిధ రంగాల్లో ప్రజా ప్రతినిధులు, మహిళా మణులు, అభిమానులు కార్యకర్తలు యువకులు కాలనీవాసులు పెద్దలు పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.